బ్రహ్మానందం గారి లైఫ్ స్టోరీ..


తెలుగు హాస్యనటుడు, నవ్వుల రారాజు అయిన బ్రహ్మానందం గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కూడా సాధించారు.

బ్రహ్మానందం గారి పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. ఈయన ఫిబ్రవరి 1 1956 సంవత్సరంలో జన్మించారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ముప్పాళ్ళ మండలం చాగంటి వారి పాలెం లో జన్మించారు. ఈయన తండ్రిగారి పేరు నాగలింగ చారి తల్లి గారి పేరు లక్ష్మి. బ్రహ్మానందం గారు మొదటిగా పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో తెలుగు మాస్టర్ గా పనిచేశరు. బ్రహ్మానందం గారు తెలుగు సాహిత్యంలో కూడా ఎక్కువ పట్టు ఉంది. అందువలన విద్యార్థులకు పాఠ్యాంశాలు చెప్పినప్పుడు కూడా హాస్య త్తరంగా చెప్పేవారు.
ఈయన 1985లో దూరదర్శన్లో పకపకలు కార్యక్రమం చేసేవారు. అంతకు ముందు ఎటువంటి చానళ్లు లేవు. ఒక్క దూరదర్శన్ లో మాత్రమే ఉండేవి.గారు ఇప్పటివరకు వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు.

బ్రహ్మానందం గారు 1986లో ఆహనా పెళ్ళంట లో ఒక పాత్ర పోషించారు. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు తన ముఖంలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి నవ్వకుండా ఉండలేరు. ఆ తరువాత చాలా సినిమాల్లో అనేక పాత్రల్లో నటించి కడుపుబ్బా నవ్వించారు. ఆయన చూపించే ప్రతి ఎక్స్ప్రెషన్ కి మనం నవ్వకుండా ఉండలేం. బ్రహ్మానందం గారు తెలుగులోనే కాకుండా తమిళ్ మరియు కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. 1986 నుండి ఇ ఇప్పటివరకు ప్రతి సంవత్సరం సుమారుగా 20 చిత్రాల్లో నటించారు. బ్రహ్మానందం సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా చేశారు.

ఈయన కి ఇచ్చిన అవార్డు గురించి మాట్లాడుకుంటే 2009లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ పురస్కారంతో బ్రహ్మానందం గారిని సత్కరించింది. బ్రహ్మానందం గారు పేపర్ మీద బొమ్మలు కూడా వేస్తారు. దీనివలన ఫోర్త్ highest civilian award కూడా లభించింది. అత్యధిక సినిమాలు చేయడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కూడా సాధించారు. పాటలు 2002లో ఫిలింఫేర్ అవార్డ్ 1993,1994,1995,1996,2008,2014లో నంది అవార్డు కూడా అందుకున్నారు. సినిమా అవార్డ్ ఆఫ్ బెస్ట్ కమెడియన్ మరియు 2011 2013 2014 సైమా అవార్డు కూడా అందుకున్నారు. ఈ అవార్డు తో పాటుగా చాలా అవార్డులు బ్రహ్మానందం గారు అందుకున్నారు.
బ్రహ్మానందం గారు ఒక లెక్చరర్ గా ఒక ఆర్టిస్ట్ గా మరియు సినిమాల్లో కూడా నటించారు. ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంకా ఎక్కువ సినిమాల్లో నటించాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

Post a Comment

0 Comments