గుజరాత్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.ఈరోజు(శనివారం) ఉదయం సురేంద్ర నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.ఒక వైపు నుండి వేగంగా వస్తున్న డంపర్ వెహికిల్ కారును ఢీకొనడంతో రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. దాని వలన కారులో మంటలు రావడం జరిగింది.అందులో ప్రయాణం చేస్తున్న ఏడుగురు వ్యక్తులు అగ్నికి ఆహుతి అయ్యారు.అతి వేగమే ప్రమాదానికి కారణం అయినట్లు పోలీసులు ప్రాధమిక నిర్దారణకు వచ్చారు.వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తున్నారు.
0 Comments