ఏపీలో జూన్ 7 నుండి 14 వరకు 10వ తరగతి పరీక్షలు..

ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి వారికి జూన్ 7 నుండి 14 వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి గారు ఆదిమూలపు సురేష్ సమీక్ష సమావేశంలో తాత్కాలికంగా షెడ్యూల్ని రూపొందించడం జరిగింది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. పరీక్ష సమయం ఉదయం 9:30 నుండి 12:45 వరకు జరుగుతాయి. జూన్ 15న ఒకేషనల్ తియరి ఎగ్జామ్ ఉదయం 9:30 నుండి 11 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుంది.జూన్ 17 నుంచి 26 వరకు పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. జులై 5న ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది.

Post a Comment

0 Comments