విజయ్ "మాస్టర్" రేపే విడుదల..

డైరెక్టర్ కనకరాజ్ మరియు తమిళ్ సూపర్ స్టార్ , ఇళయ దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ "మాస్టర్". ఈ మూవీ జనవరి 13 అనగా భోగి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ కరోనా కారణంగా దాదాపుగా ఎనిమిది నెలలు థియేటర్లు మూత పడడం జరిగింది. ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది.ఈ సినిమాలో విజయ్ స్కూల్ మాస్టర్ గా కనిపించనున్నారు అని టాక్.ఈ మూవీలో విలన్ గా తమిళ హీరో విజయ్ సేతుపతి కనిపించనున్నారు. ఈ మూవీ హిందీలో కూడా విడుదల కాబోతుంది.కానీ హిందీ వెర్షన్ లో మూవీ జనవరి 14 న విడుదల అవుతుంది. ఈ మూవీలో హీరోయిన్ మాళవికా మోహనన్ నటించారు.ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అనిరుద్.ఈ సినిమా వ్యవధి రెండు గంటల 58 నిమిషాలు. ఇప్పటికే టీజర్ ప్రోమో లతో భారీ హైప్ క్రియేట్ చేయడం జరిగింది.రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా ఎలా ఉందో చూడాలి.

Post a Comment

0 Comments